‘C 202’ మూవీ రివ్యూ & రేటింగ్

WhatsApp Image 2024 10 25 at 13.20.14 0b07a132

మున్నా కాశి స్వీయ నటనా దర్శకత్వంలో మనోహరి నిర్మాతగా షారోన్ రియ, తనికెళ్ల భరణి, సత్య ప్రకాష్, శుభలేఖ సుధాకర్, షఫీ, అర్చన ఆనంద్, చిత్రం శ్రీను తదితరులు కీలకపాత్రలో నటిస్తూ ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా C 202. ఈ చిత్రానికి మున్న కాశీ మ్యూజిక్ అందిస్తూ ఎడిటింగ్ వర్క్ కూడా చేయడం విశేషం. సీతారామరాజు ఉప్పుతల్ల ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.

కథ :
కథ మొత్తం ఒక ఇంట్లో జరుగుతుంది. C 202 ఇంట్లో ఒక హత్య జరుగుతుంది. అది ఒక సాంఘిక శక్తి చేతబడి వల్ల జరుగుతుంది. తనికెళ్ల భరణి (బూరా) భూతాల రాజుగా, వశీకరణం, చేతబడి తెలిసిన వ్యక్తి. తను చేసిన చేతబడితోనే ఆ ఇంట్లో ఒక అమ్మాయి చనిపోతుంది. అదే ఇంట్లోకి శుభలేఖ సుధాకర్, అర్చన ల కుటుంబం వస్తుంది. వాళ్లకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి పెళ్లి అయిపోయి యుఎస్ లో ఉంటుంది. వాళ్లు తమ పెద్దమ్మాయి దగ్గరికి వెళ్తూ మిగతా ఇద్దరు కూతుళ్ళని ఇద్దరు స్నేహితులతో ఆ ఇంట్లో వదిలి వెళ్తారు. అందులో ఒక స్నేహితుడిగా మున్నాకాశి (అయాన్) షరూన్ రియా ఫెర్నాండెస్ (రియా), తన చెల్లికి మరియు తన స్నేహితురాలు మ్యాడి కి తోడుగా ఉంటాడు. ఆ ఇంట్లో వీళ్ళందరికీ వింత వింతగా రూపాలు కనపడటం భయం కలిగించే సంఘటనలు జరుగుతాయి. అసలు ఆ ఇంట్లో ఏముంది? శుభలేఖ సుధాకర్ కుటుంబం ఆ ఇంటికి ఎలా వెళ్లారు? ఆ ఇంట్లో ఉన్న అసాంఘిక శక్తులను ఎవరు తరిమికొట్టారు? తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :

మున్నాకాశి, షరూన్ రియా ఫెర్నాండెస్ అద్భుతంగా నటించారు. భయపడి భయపెట్టే క్యారెక్టర్లలో మంచి నటనను కనబరిచారు. భూతాల రాజు గా తనికెళ్ల భరణి గారి క్యారెక్టర్ బావుంది. సత్య ప్రకాష్, షఫీ, వై. విజయ వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సపోర్టింగ్ రోల్ లో చిత్రం శ్రీను నటన, క్యారెక్టర్ చాలా బాగున్నాయి. తనికెళ్ల భరణి, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శ్రీను పాత్రలు సినిమాకి ప్లస్.

టెక్నికల్ విశ్లేషణ :
కథని ఎంచుకోవడం దగ్గరనుంచి స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఎడిటింగ్ మరియు దర్శకత్వం వహించిన మున్నాకాశి పడిన కష్టం కనిపిస్తుంది. చిన్న సినిమా అయినా ప్రొడక్షన్ వైస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మాత మనోహరి ఈ చిత్రాన్ని నిర్మించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

కథ, కథనం, నటీనటుల నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లో కథలోకి వెళ్లడానికి లాగ్, సెకండ్ హాఫ్ లో సీన్స్ కనెక్టివిటీ

సారాంశం :

హర్రర్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే సినిమా.

రేటింగ్ :3/5