మంత్ర, మంగళం వంటి సినిమాలు దర్శకత్వం చేసిన ఓషో తులసి రామ్ రచన దర్శకత్వంలో వచ్చిన సినిమా దక్షిణ. సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి సినిమాలో రజనీకాంత్ కూతురుకు నటించిన సాయి ధన్సిక ముఖ్యపాత్రలో నటిస్తూ విషబ్ బసు, స్నేహ సింగ్, కరుణ, ఆర్నా ములెర్, మేఘన చౌదరి, నవీన్ తదితరులు నటిస్తూ కల్ట్ కాన్సెప్షన్ నిర్మాణ సంస్థ ద్వారా అశోక నిర్మించిన చిత్రం దక్షిణ. ఈ చిత్రానికి బాలాజీ సంగీతం అందించగా రామకృష్ణ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు.
కథ:
వైజాగ్ నగరం ఓ సైకో ఆడవారిని టార్గెట్ చేస్తూ చంపేస్తూ ఉంటాడు. ఆ సైకో కేసును ఓ పోలీస్ ఆఫీసర్ డీల్ చేస్తుంటుంది. అయితే దక్షిణకు ఈ కేసుకు సంబంధం ఏంటి? అసలు దక్షిణ పోలీసా లేదా సైకోనా? చివరికి ఆ సైకో పోలీసులకు పట్టు పడతాడా లేదా? అనేది సినిమా కథ.
నటీనటుల నటన:
సినిమాలో సాయి ధన్సిక క్యారెక్టర్ కు పోటీగా సైకో కూడా నటించాడు. మిగతావాడు తమ తమ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. అయితే సినిమాలో మరి ముఖ్యంగా సాయి దన్సిక 2 లుక్స్ తో కనిపిస్తూ అటు క్లాస్ ఇంకా ఇటు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
సాంకేతిక విశ్లేషణ:
చిత్రంలో సాంకేతిక విశ్లేషణ విషయానికొస్తే గతంలో ఈ దర్శకుడు తీసిన మంత్ర, మంగళం అంత ఇంపాక్ట్ ఈ సినిమాకు లేదని చెప్పుకోవాలి కానీ సైకో కావడంతో కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంగీతం అంతగా అలరించకపోయినప్పటికీ సినిమాలోని ఇతర సాంకేతిక విషయాలు రచకరులు మెప్పించడంలో ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
సాయి ధన్సిక, సైకో నటన, కథ, కలరింగ్.
మనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే, సంగీతం.
సారాంశం:
సైకో పిల్లలను ఇష్టపడేవారు కచ్చితంగా ఎంజాయ్ చేసే సినిమా దక్షిణ అవుతుంది.
రేటింగ్ : 3/5