ప్రముఖ యూట్యూబ్ హర్ష సాయి పై నిన్న సాయంత్రం ఓ మహిళ హైదరాబాదులో కేసు నమోదు చేసింది. తనని యూట్యూబర్ హర్ష సాయి మోసం చేశాడని, అదేవిధంగా తనని వాడుకుంటూ తన డబ్బులు సుమారు రెండు కోట్ల రూపాయల తీసుకున్నాడని ఆమె పేర్కొంది. అయితే ఆ మహిళ ఎవరు అంటే హర్ష సాయి ఇప్పటికే ఒక సినిమాలో తన స్వీయ రచనా దర్శకత్వంలో హీరోగా చేయనున్నాడు. ఆ సినిమాకు ఆ మహిళ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ హీరోయిన్గా కూడా తానే నటిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో ఆమె బిగ్ బాస్ కు కూడా వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనను మోసం చేసి అలాగే సైడ్ కంగారు నన్ను వాడుకున్నట్లు తన యొక్క న్యూడ్ ఫోటోలు కొన్ని హర్ష సాయి దగ్గర పెట్టుకొని వాటితో తనని బెదిరిస్తున్నట్లు ఆ మహిళ ఆ కేసులో పేర్కొన్నట్లు సమాచారం వినిపిస్తుంది.
ఇది ఇలా ఉండగా దీనిపై యూట్యూబ్ హర్ష సాయి స్పందిస్తూ ఈరోజు తన సోషల్ మీడియా అయిన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక స్టోరీ పెట్టారు. నేను ఎలాంటి వాడిని అనేది నా ఫాలోవర్స్ కి అందరికీ తెలుసు. ఇది అంతా కేవలం డబ్బు కోసం ఆమె చేస్తుంది. దీని గురించి త్వరలోనే మా లాయర్ మాట్లాడుతారు అంటూ ఆ పోస్టులో హర్ష సాయి పేర్కొన్నారు.
అయితే గతంలో కూడా హర్ష సాయిపై బెట్టింగ్ యాప్స్ ద్వారా సొమ్ము చేసుకుంటాడంటూ కొంతమంది యూట్యూబ్లో కొన్ని ఛానల్ డిబేట్స్ లో మాట్లాడారు. అదేవిధంగా తన చుట్టూ ఉన్న వారు ఎవరో కూడా తెలియకుండా హర్ష సాయి జాగ్రత్త పడడానికి కారణం అదే అని వాళ్ళు అన్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో రెండు ఇటువంటి కేసులు నమోదు అయ్యాయి. ఇది మరో కేసు కావడం వల్ల సినిమా ఇండస్ట్రీ పై సాధన ప్రజలకు ఒక చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.