అర్జున్ సాయి రచనా దర్శకత్వంలో రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ గా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తూ సునీల్ పాటిల్ నిర్మించిన చిత్రం ఉత్సవం. ఈ సినిమాలో దిలీప్ ప్రకాష్, రెజీనా కసండ్రా హీరో హీరోయిన్ పాటలు చేయగా ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, ఆలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, ప్రియదర్శి, ఆమని, సుధా, తదితరులు కీలకపాత్రను పోషించారు. నాటక సంఘాలలో పేరుగాంచిన సురభి నాటకం అనే ఓ నాటకం చుట్టూ తిరిగే ప్రేమతో పాటు కుటుంబ కథ ఇది. ఇక కథ విషయానికి వస్తే…
కథ:
రెండు నాటక కుటుంబాల మధ్యలో జరిగే ఓ ప్రేమకథగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. కుటుంబమంతా నాటకాలు వేసేవారు ఉండటంతో హీరోకు నాటకాలు అంటే అమితమైన గౌరవం, ఇష్టం. అలాగే చిన్నప్పటినుండి చుట్టూ నాటకాలు ఉండటంతో వాటి వలన కొంచెం బోర్ గా ఫీల్ అవుతూ ఉండే అమ్మాయి హీరోయిన్. వీళ్ళిద్దరి పరిచయం ఎలా అవుతుంది? ఆ పరిచయం అప్పటికే పరిచయస్తులైన ఆ కుటుంబాల మధ్య వీరి ప్రేమ ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది? వారి ఇద్దరికీ చివరికి పెళ్లి అవుతుందా లేదా? అనేది కథ.
నటీనటుల నటన:
సినిమాలో ఒక హీరోనే కొంచెం కొత్తగా కనిపిస్తున్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టు న్యాయం చేస్తూ చాలా బాగా నటించాడు. మిగతా వారందరూ తనకంటే సీనియర్లు కావడంతో ఎంతో జాగ్రత్తగా ప్రతి చిన్న విషయాన్ని అలాగే ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్ను కచ్చితంగా పలుకుతూ మిగిలిన వారితో పోటీగా తన పాత్రను హీరో పోషించాడు. రెజీనా కసాండ్రా అటు మాడ్రన్ అమ్మాయిగా అలాగే ఇటు తెలుగమ్మాయిగా రెండు బ్యాలెన్స్ చేస్తూ బాగా నటించారు. అదేవిధంగా నటనలో ఇప్పటికే ఎన్నో పాత్రను పోషించినటువంటి నటీనటులు ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ, ప్రేమ, ఆమని తదితరులు తమ పాత్రలకు తగ్గట్లు నటిస్తూ సినిమాకు తమ నటనతో ప్రాణం పోసారని చెప్పుకోవచ్చు.
సాంకేతిక విశ్లేషణ:
సినిమాలో ముఖ్యంగా రచనా దర్శకత్వంతో పాటు సంగీతం గురించి మరింతగా చెప్పుకోవచ్చు. సినిమా అంతటా వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరొక మెట్టు పైకి తీసుకెళ్ళింది చెప్పుకోవాలి. అదేవిధంగా సినిమాలో ఉపయోగించిన కలరింగ్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలతో మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చెప్పాలి. అదేవిధంగా స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉంది. నేటి సినిమాలకు కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ మంచి కథ ఉన్న సినిమాల దీనిని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే లో కొంచెం సాగతీత ఉన్నప్పటికీ ఇటువంటి కథలు ఉన్న సినిమాలు ఇలా తీస్తేనే ప్రేక్షకులకు చేరుతాయి.
ప్లస్ పాయింట్స్:
సంగీతం, దర్శకత్వం, నటన.
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ పై లో కొంచెం సాగతీత, కొంచెం అవుట్డేటెడ్ స్టోరీ కావడం.
ఒక మాటలో చెప్పాలంటే ఉత్సవం అనే సినిమా అటు కళాకారులకు అలాగే ఇటు కళను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి నిజంగా ఓ ఉత్సవం.
రేటింగ్ : 3/5