“కమిటీ కుర్రోళ్ళు” మూవీ రివ్యూ

Committee Kurrallu 2 696x392 1

90’s లో ఊళ్ళల్లో ఉండే స్నేహం గొడవలు చాలా బాగా చూపించిన చిత్రం

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై నిహారిక కొణిదల నిర్మాతగా యదు వంశీ దర్శకత్వంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, టీనా శ్రావ్య, రాద్య సురేష్, తేజస్వి రావు, సాయికుమార్, గోపరాజు రమణ, రమణ భార్గవ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా కమిటీ కుర్రాళ్ళు. రాజు ఎదురోల్లు డిఓపి గా అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందించారు.

కథ విషయానికొస్తే :
90’s నుంచి ఈ జనరేషన్ వరకు అమలాపురం దగ్గరలో ఉన్న పురుషోత్తం పురం లో ఉండే కమిటీ కుర్రాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ల స్నేహం వాళ్ళ మధ్య గొడవలు అక్కడ 12 ఏళ్లకు ఒకసారి జరిగే జాతరలు చాలా బాగా చూపించారు. పురుషోత్తం పురం లో ఉండే 11 మంది స్నేహితులు అనుకోకుండా జరిగిన ఒక చిన్న గొడవ వల్ల రెండు గ్రూపులుగా విడిపోతారు. ఊరికి పెద్దగా గోపరాజు రమణ గారు ఈ కుర్రాళ్లందరినీ మంచిగా లీడ్ చేస్తుంటారు. కానీ సాయి కుమార్ గారు కులం పేరు మీద ఈ గ్రూపుల మధ్యన చిచ్చు పెడతారు. అదేవిధంగా క్యాస్ట్ సిస్టం ని రిజర్వేషన్స్ని డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశారు. అంత మంచిగా ఉన్న వాళ్ళ స్నేహం ఎందుకు విడిపోయారు? చివరికి ఆ స్నేహితులు కలిసారా లేదా? ఒక జాతరలో విడిపోయిన వాళ్ళు మళ్లీ 12 ఏళ్ల తర్వాత జరిగిన జాతరకి కలిసారా లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవరు ఎలా చేశారంటే?
11 మంది కుర్రాళ్ళు కొత్తవాళ్ళైనా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ప్రసాద్ బెహరా పెద్దోడిగా మంచి నటనను ఎమోషన్ ని కనపరిచారు. సాయి కుమార్ గారు, గోపరాజు రమణ గారు, రమణ భార్గవ్ గారు, మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. కంచరపాలెం కిషోర్ గారు తండ్రి పాత్రలో ఎమోషన్స్ని చాలా బాగా పండించారు.

టెక్నికల్ యాస్పెక్ట్స్ :
పింకి ఎలిఫెంట్ ప్రొడక్షన్స్పై నిహారిక కొణిదల నిర్మాతగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో సినిమాను నిర్మించారు. దర్శకుడు యదు వంశి ఆంధ్ర సైడ్ లో జరిగే జాతరను చాలా బాగా చిత్రీకరించారు. 90’s కి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఫ్రెండ్షిప్ లో ఉండే గొడవలని వాల్యూస్ ని చాలా బాగా చూపించారు. పూరి వాతావరణాన్ని ఆంధ్ర సైడ్ స్లాంగ్ ని బాగా చూపించారు. అనుదీప్ దేవ్ అందించిన పాటలు మ్యూజిక్ సినిమాకి ప్లస్.

ప్లస్ పాయింట్స్ : ఆర్టిస్టుల నటన, మ్యూజిక్, సాంగ్స్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ.

మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్, అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్

రేటింగ్ : 3/5