పర్యావరణ పరిరక్షణ ని సైన్స్ కి లింక్ చేస్తూ వచ్చిన సందేశాత్మక చిత్రం
జగపతిబాబు ప్రత్యేక పాత్రలో అనసూయ భరద్వాజ్, వశిష్ట ఎన్. సింహ, బిగ్ బాస్ దివి, అనీష్ కురువిళ్ళ, కబీర్ దుహన్ సింగ్, శ్రీనాథ్ మాగంటి, గౌతమి, కస్తూరి ముఖ్యపాత్రలో నటించిన సినిమా సింబ. సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించగా మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. కృష్ణ సౌరబ్ సంగీతం అందించారు.
కథ విషయానికొస్తే : స్కూల్లో టీచర్ గా పని చేస్తున్న అనసూయ భరద్వాజ్ తన కుటుంబంతో ఆనందంగా ఉంటుంది. చీమకు కూడా హాని చేయని మనస్తత్వం. శ్రీనాథ్ జర్నలిస్టుగా అనీష్ కురివిళ్ళ డాక్టర్ గా నటించారు. పర్యావరణాన్ని రక్షించే ఫారెస్ట్ మ్యాన్ పాత్రలో జగతిబాబు గారు నటించారు. ఎవరికి పనిచేయని ఈ ముగ్గురు మూడు హత్యల కేసులో ఇరుక్కుంటారు. ఆ మూడు హత్యలు ఈ ముగ్గురే చేశారా? ఎవరు, ఎందుకు హత్య చేశారు? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరు ఎలా చేశారంటే?
సింబ గా ఇంటెన్స్ క్యారెక్టర్ లో జగపతిబాబు గారి నటన అద్భుతం. అనసూయ, అనీష్ కురువిళ్ళ, శ్రీనాథ్ మాగంటి క్యారెక్టర్ లోని ఎమోషన్, ఇంటెన్సిటీ చాలా బాగా చూపించారు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా వశిష్ట ఎన్ సింహ సైకాలజీ డాక్టర్ గా గౌతమి గారు చాలా బాగా నటించారు.
టెక్నికల్ యాస్పెక్ట్స్ :
దర్శకుడుగానే కాకుండా నిర్మాతగా కూడా సంపత్ నంది గారిలో మంచి టేస్ట్ ఉందని ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో సినిమాను నిర్మించారు. దర్శకుడు మురళీ మనోహర్ ఎంచుకున్న కథ, కథనం బాగున్నాయి. కృష్ణ సౌరబ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్.
ప్లస్ పాయింట్స్ : జగపతిబాబు గారు నటన. అనసూయ, శ్రీనాథ్, అనీష్ కురవిళ్ళ, వశిష్ట ఎన్ సింహ, గౌతమి గారి క్యారెక్టర్లు. దర్శకుడు ఎంచుకున్న కథ. ఫస్ట్ ఆఫ్.
మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్, అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్స్, విలన్ క్యారెక్టర్ లో అంత ఇంపాక్ట్ లేకపోవడం.
రేటింగ్ : 2.75/5