ప్రాజెక్ట్ K అంటే కల్కి కాదు? మరేంటి?

kalki 2898 ad movie review

ప్రభాస్ హీరోగా వచ్చిన పాన్ వరల్డ్ సినిమా కల్కి 2898 AD. నాగేశ్వన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీదత్, ఆయన కుమార్తె స్వప్న దత్ నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

కథ : మహాభారతయుద్ధంలో శ్రీకృష్ణుని చే శాపం పొందిన అశ్వద్ధాముడు కలియుగంలో ఒక కర్తవ్యాన్ని నెరవేర్చడానికి 6000 సంవత్సరాలు పాటు బ్రతికే ఉంటాడు. ప్రపంచమంతా అంతమైపోయినాక ఆఖరినగరంగా మిగిలిన కాశీలో కొంతమంది ప్రజలు ఉంటారు. అశ్వద్ధామముడు తను అనుకున్న కర్తవ్యాన్ని నెరవేర్చడా లేదా? భైరవ గా ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుంది? కమల్ హాసన్, దీపిక పదుకొనే, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ పాత్రలు ప్రత్యేకత ఏంటి?అసలు కాంప్లెక్స్ ఏంటి అందులో ఏముంది అక్కడికి వెళ్లడానికి ప్రభాస్ ఎందుకు ఆసక్తి చూపిస్తాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు :
భైరవగా ప్రభాస్ అద్భుతమైన నటన కనబరిచాడు. కామెడీ మరియు యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. అశ్వత్థాముడుగా అమితాబచ్చన్ గారు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీపిక పదుకొనే, రుణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, కమల్ హాసన్ ఎవరి పాత్రల్లో వారు ఇమిడిపోయి అద్భుతంగా నటించారు. రాంగోపాల్ వర్మ, రాజమౌళి కామియో రోల్స్ చాలా బాగున్నాయి. దిశా పటాని పాత్రకి అంత ప్రాముఖ్యత లేదు.

పాజిటివ్స్ : నాగ అశ్విన్ ఎంచుకున్న కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే
ప్రభాస్ నటన బుజ్జి, బైరవ మధ్య కెమిస్ట్రీ
అమితాబచ్చన్ సినిమాకి పెద్ద ప్లస్
కమల్ హాసన్ ఉన్న పరిధి మీద అద్భుతమైన నటన
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ఇంటర్వెల్ సీన్, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ దాకా అద్భుతమైన విజువల్స్

నెగిటివ్స్ : ఫస్ట్ ఆఫ్ అక్కడక్కడ ఉన్న లాగ్ సీన్స్

రేటింగ్ : 3.5/5

చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూసే చూడదగ్గ సినిమా కల్కి 2898AD.

మహాభారతంలోని ముఖ్యమైన పాత్రల గురించి తెలుసుకోవాలి అనిపించేలా చేసిన సినిమా కల్కి 2898AD.