బుల్లితెర నటుడు చందు ఆత్మహత్య

1200 675 21496049 thumbnail 16x9 actor

టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నార్సింగ్‌లోని అల్కాపూరి కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కాగా, చందు తెలుగులో త్రినయని, కార్తీక్ దీపం, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్‌తో చందుకు ఆరేళ్లుగా దగ్గర అనుబంధం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవిత్ర మృతిని తట్టుకోలేక చందు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

యాక్టర్ చందు మరణవార్త తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చందు ఆకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడానికి గల కారణమేంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు చందు మరణవార్తతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.