
‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో యూత్‌లో సంచలనం సృష్టించిన సిద్దు జొన్నలగడ్డ, తన తాజా చిత్రం ‘తెలుసు కదా’తో మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ, అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టితో సిద్దు కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుందని టాక్. సిద్దు స్టైల్, స్వాగ్, పంచ్ డైలాగులు ఈ సినిమాలోనూ ఆకర్షణగా నిలవనున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం హై-ఎండ్ ప్రొడక్షన్ విలువలతో రూపొందుతోంది. షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, దీపావళి సీజన్లో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్దు సన్నద్ధమవుతున్నారు.
