రజనీకాంత్‌తో వివేక్ ఆత్రేయ – కోలీవుడ్‌లో కొత్త ఒరవడి

Screenshot 2025 05 17 181723

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయ భారీ చిత్రం చేసే అవకాశం కొట్టేశారు. ‘బ్రోచేవారెవరురా’, ‘సరిపోదా శనివారం’ వంటి హిట్స్‌తో గుర్తింపు పొందిన వివేక్, రజనీ కోసం పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. రజనీ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో సత్తా చాటిన మైత్రీ, రజనీతో సంచలన ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టింది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. యంగ్ హీరోలతో విభిన్న కథలతో మెప్పించిన వివేక్, రజనీని ఎలా చూపిస్తారనే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ కాంబో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా కోలీవుడ్‌లో సరికొత్త ఒరవడి సృష్టిస్తుందని అంటున్నారు.