
తమిళ స్టార్ విశాల్, నటి సాయి ధన్సిక వివాహం ఖరారైంది. చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో ‘యోగిదా’ సినిమా ప్రెస్ మీట్‌లో విశాల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సాయి ధన్సిక ఆగస్టు 29న విశాల్‌తో పెళ్లి జరగనుందని ప్రకటించారు. ‘కబాలి’లో రజనీకాంత్ కూతురిగా మెప్పించిన సాయి, తెలుగులో ‘షికారు’, ‘వాలుజడ’ వంటి చిత్రాలతో అలరించింది. విశాల్ పెళ్లి గురించి ఎన్నాళ్లుగా జరుగుతున్న రూమర్స్‌కు ఈ ప్రకటనతో క్లారిటీ వచ్చింది. అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.