
విజయ్ దేవరకొండ పేరు చెబితే యూత్‌లో జోష్ మొదలవుతుంది. ‘లైగర్’, ‘ఖుషి’ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, విజయ్ క్రేజ్‌లో తగ్గుదల లేదు. తాజాగా, మే ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కవర్లో బ్లాక్ లెదర్ జాకెట్, రఫ్ హెయిర్‌స్టైల్‌తో మాస్ లుక్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. “విజయ్ మార్క్ స్టైల్ అరుదు” అని పేర్కొంటూ, ఫ్యాన్స్ ఈ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. విజయ్ నెక్స్ట్ మూవీ ‘కింగ్డమ్’ హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రూపొందుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా జులై 4న విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయ్‌కు మరో బ్లాక్‌బస్టర్ అందిస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.