
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా గురించి రోజుకో రూమర్ వినిపిస్తోంది. తాజాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ విద్యా బాలన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఆమె ఓ పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారని టాక్. ప్రశాంత్ నీల్ సినిమాల్లో క్యారెక్టర్స్ ఎప్పుడూ బలంగా ఉంటాయి కాబట్టి, విద్యా పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్‌పై ఏళ్ల తరబడి కసరత్తు చేశాడట. “ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. ఎన్టీఆర్ అభిమానిగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నా” అని ప్రశాంత్ గతంలో చెప్పుకొచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రశాంత్ నీల్ ఫిల్మోగ్రఫీలోనే అత్యుత్తమంగా నిలిచే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. విద్యా బాలన్ ఎంట్రీతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.