మరోసారి నెగిటివ్ పాత్రలో టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర

Screenshot 2025 10 28 153050

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రానున్న చిత్రం మాస్ జాతర. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం చేయగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించగా అయ్యన్న సినిమాటోగ్రఫీ చేశారు. అయితే ఈ చిత్రంలో ఎంతో పవర్ఫుల్ పాత్ర అయిన నెగిటివ్ రోల్ ను టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర పోషించడం గమనించాల్సిన విషయం. గతంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నవీన్ చంద్ర నెగటివ్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించడం జరిగింది. మాస్ జాతర చిత్ర ట్రైలర్ లో చూస్తే నవీన్ చంద్ర వాయిస్ ఓవర్ తో మొదలై “కేజీ రెండు కేజీలు కాదురా! 20 టన్నులు. ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్ లో ఎక్కించండి” అంటూ నవీన్ చంద్ర గంభీరమైన గొంతు ముందుగా గూస్బంప్స్ తెప్పిస్తూ మొదలైంది.

ట్రైలర్ లోని నవీన్ చంద్ర విజువల్స్ ఎంత అద్భుతంగా పవర్ఫుల్గా ఉన్నాయి. అలాగే నవీన్ చంద్ర లుక్ విషయానికి వస్తే జుట్టు గడ్డంతో ఎంతో రగ్గడ్ గా కనిపిస్తూ ట్రైలర్ లోని మరొక డైలాగ్ తో తన క్యారెక్టర్ ఎంత ఇంటెన్సిఫైడ్ గా పవర్ ఫుల్ గా ఉంటుందో కేవలం ఆ ఒక్క డైలాగుతూనే అర్థమవుతుంది.”లక్ష్మణుడు అంటే రాముడి బ్రదర్. అర్థాయిషుతో పోతే ఆంజనేయుడు బ్రతికించిన క్యారెక్టర్! ఇక్కడ సంజీవని లేదు, ఆంజనేయుడు రాడు. ప్రతి కరిపోలమ్మ జాతరకి శత్రువుల్ని బలివ్వడం నా ఆనవాయితీ, ఈ సుట్టు నాను నిన్ను బలిస్తున్నాను రా” అంటూ ట్రైలర్ కు ముగింపు ఇచ్చారు. ట్రైలర్ లో నవీన్ చంద్రను చూస్తే ఈ చిత్రంలోని అతని క్యారెక్టర్ తన సినీ కెరియర్ లో మరొక మార్క్ గా నిలిచిపోతుందని అర్థమవుతుంది. అంతేకాక ఈ పాత్రను చూసి ముందు ముందు మరెన్నో పవర్ఫుల్ పాత్రలు ఆయన కోసం రావడం కాకుండా ఆయన కోసం రాసే విధంగా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. ఈ చిత్రం అక్టోబర్ 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.