
న్యాచురల్ స్టార్ నాని ‘హిట్-3’తో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ‘ది ప్యారడైజ్’ కోసం సిద్ధమవుతున్నారు. నాని సరికొత్త లుక్తో అభిమానులను సర్ప్రైజ్ చేయనున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. సినిమాటోగ్రాఫర్ జికె. విష్ణు కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో చిత్ర యూనిట్ కొత్త టాప్ సినిమాటోగ్రాఫర్ కోసం వెతుకుతోంది. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా నాని కెరీర్లో మరో సంచలనం సృష్టించనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ట్విస్ట్ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి!