‘ది ప్యారడైజ్’ బిగ్ డీల్ : నాని-అనిరుధ్ మాస్ రికార్డ్

Screenshot 2025 05 16 105833

నాచురల్ స్టార్ నాని ‘హిట్ 3’ విజయంతో సక్సెస్ జోరు కొనసాగిస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం బిజినెస్‌లో సంచలనం సృష్టిస్తోంది. సినిమా ఆడియో హక్కులు రూ.18 కోట్లకు అమ్ముడుపోయాయని సమాచారం. సరిగమ మ్యూజిక్ లేబుల్ ఈ హక్కులను కైవసం చేసుకుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ డీల్‌కు కీలకం. నాని ఎంటర్‌టైన్‌మెంట్, అనిరుధ్ మ్యూజిక్ కాంబోతో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద హడావిడి చేయనుంది. షూటింగ్ వేగంగా సాగుతుంది. నాని అభిమానులు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.