
సౌత్ సినిమాల్లో హిట్ జోడీలు మళ్లీ తెరపై కనిపించనున్నాయి. నాగార్జున-టబు, వెంకటేష్-మీనా, రజనీకాంత్-రమ్యకృష్ణ లాంటి జంటలు తమ కెమిస్ట్రీతో ఆకట్టుకోనున్నాయి.
సౌత్ ఇండియన్ సినిమాల్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన జంటలు మళ్లీ తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. నాగార్జున, టబు జంట ‘నిన్నే పెళ్లాడతా’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత, నాగ్ 100వ చిత్రంలో ఈ జంట మళ్లీ కనిపించనుంది. తమిళ దర్శకుడు కార్తీక్ ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తుండగా, నాగచైతన్య, అఖిల్ గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారు. అలాగే, వెంకటేష్-మీనా జంట ‘చంటి’ నుంచి ‘దృశ్యం 2’ వరకు అద్భుతమైన కెమిస్ట్రీని చూపించారు. ఇప్పుడు ‘దృశ్యం 3’లో మళ్లీ కలిసి నటించనున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను జీతు జోసెఫ్ త్వరలో ప్రారంభించనున్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, రమ్యకృష్ణ ‘నరసింహ’లో మెప్పించిన ఈ జంట, ‘జైలర్’లో భార్యాభర్తలుగా కనిపించారు. రాబోయే ‘జైలర్ 2’లో కూడా వీరి కెమిస్ట్రీ కొనసాగనుంది. ఈ జంటలు తమ గత విజయాలను మళ్లీ రిపీట్ చేస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.
