సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ పై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెస్ మీట్

WhatsApp Image 2024 01 04 at 22.29.55 063c3f0d

సంక్రాంతి అంటేనే సినిమాల జోరు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు థియేటర్స్ మరియు బిజినెస్ ఇబ్బందుల పైన. విడుదలయ్యే ప్రతి సినిమా మంచి బిజినెస్ చేసుకోవాలి ప్రొడ్యూసర్ కి లాభాలు రావాలి.

ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మాట్లాడుతూ : సోషల్ మీడియా వెబ్సైట్స్ న్యూస్ ఛానల్స్ ఎప్పుడు ఇండస్ట్రీకి సపోర్ట్ గానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని సార్లు వాళ్లకు వచ్చే న్యూస్ ద్వారా ఇండివిడ్యువల్ గా డ్యామేజ్ జరుగుతోంది. సంక్రాంతి పండక్కి ఎప్పుడు సినిమాలు పోటీ ఉంటుంది కాని 15 రోజుల క్రితం ప్రొడ్యూసర్స్ మీట్లో మేము తీసుకున్న డెసిషన్ కి ఒప్పుకుని వెనక్కి తగ్గిన ఈగల్ టీం. ఛాంబర్ అడగగానే విశ్వ ప్రసాద్ గారు వివేక్ గారు రవితేజ గారు ఒప్పుకొని బరిలో నుంచి తప్పుకోవడం మిగతా నాలుగు సినిమాలు కి కొంత స్క్రీన్స్ దొరికి బిజినెస్ చేసుకునే అవకాశం ఉండటం జరుగుతుంది. బరిలో నుంచి తప్పుకున్న ఈగల్ టీం విశ్వ ప్రసాద్ గారికి వివేక్ గారికి హీరో రవితేజ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ : సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు మీద తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రొడ్యూసర్స్ మీట్ పెట్టడం జరిగింది. ఆ మీట్ కి ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎవరి ఇబ్బందులు వాళ్ళు చెప్పుకున్నారు. అలా సంక్రాంతి బరిలో నుంచి వెనక్కి తగ్గిన ఈగల్ మూవీ టీం ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి రవితేజ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ : ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం సంక్రాంతి సినిమాల రిలీజ్ ల పైన. ఈసారి కూడా పలు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. 15 రోజుల క్రితం చాంబర్ తరఫున పలువురు ప్రొడ్యూసర్స్ ని పిలిచి గ్రౌండ్ రియాలిటీ బిజినెస్ గురించి మాట్లాడటం జరిగింది. ఆ మీటింగ్లో మేం చెప్పింది ఆలోచించి వెనక్కి తగ్గి తమ సినిమాను వాయిదా వేసుకున్న ఈగల్ మూవీ. పీపుల్స్ మీడియా విశ్వ ప్రసాద్ గారు వివేక్ అండ్ హీరో రవితేజ గారికి తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కమర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కృతజ్ఞతలు. ఇందులో ఎవరికీ ఇండివిజువల్ ఎలాంటి లాభం లేదు ఇది అందరి సినిమాల కోసం ఆలోచించి చెప్పింది గా పేర్కొన్నారు.

తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అనుపం రెడ్డి గారు మాట్లాడుతూ : సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న ఈగల్ టీం పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి రవితేజ గారికి కృతజ్ఞతలు. ఇది మా సినిమా ఇండస్ట్రీ యొక్క ఐకమత్యాన్ని తెలియజేస్తుంది అన్నారు.

ఈ ప్రెస్ మీట్ లో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు గారు, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సునీల్ నారంగ్ గారు, అనుపం రెడ్డి గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ గారు, నిర్మాతలు నిరంజన్ రెడ్డి గారు వివేక్ కూచిబొట్ల గారు చిత్తూరు శ్రీను గారు మరియు వెంకట్ బోయినపల్లి గారు పాల్గొన్నారు.