
ప్రముఖ తమిళ నటుడు, DMDK పార్టీ స్థాపకులు విజయ్ కాంత్ గారు చెన్నైలోని మియాట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. నిమోనియాతో బాద పడుతున్న విజయ్ కాంత్ గారు వెంటిలేటర్ మీద ఉండగా మరణించారు. కాగా వైద్య పరీక్షలలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది అని తెలిపారు. ఈ విష్యం విన్న తమ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన అభిమానులు, కర్తలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎందరో ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్ కాంత్ కి సంతాపం తెలియచేసారు.
విజయ్ కాంత్ 1952 ఆగష్టు 25న మదురై లో జన్మించారు. నటన పట్ల ఆయనకీ ఉన్న ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఇనుక్కుమ్ ఇలామై అనే తమిళ సినిమాతో 1979 లో ఆయన సినిమా ప్రయాణం మొదలు పెట్టగ ఎన్నో సినిమాలలో నటించి యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రజాసేవ పట్ల ఆయనకీ ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చారు. 2005 సెప్టెంబర్ 14న DMDK పార్టీ స్థాపించి MLAగా గెలిచారు. అలా మొదలైన ఆయన రాజకీయ ప్రయాణం ఎంతో మందిని రాజకీయాల వైపు ఆసక్తిని పెంచింది.
రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన సినిమాలలో నటిస్తూనే వచ్చారు. కాగా విజయ్ కాంత్ కు ఇద్దరు కుమారులు. ఆయన చివరి సినిమా మధుర విరన్ (2018). ఆయన మరణ వార్త విన్న తమిళనాడు ప్రజలు కంగుతిన్నారు.
నేడు విజయ్ కాంత్ మరణం కారణంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ తమిళనాడులోని థియేటర్ షోలను రద్దు చేసారు.