సునీల్ శెట్టి ధైర్యం… ముంబై మాఫియాను ఎదిరించిన హీరో

ముంబైలో అండర్‌వరల్డ్ బెదిరింపులు సినీ ప్రముఖులకు కొత్త కాదు. సల్మాన్ ఖాన్, రాకేష్ రోషన్, గుల్షన్ కుమార్, దివ్య భారతి లాంటి వారు ఈ బెదిరింపులను ఎదుర్కొన్నారు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఆయన తండ్రి కూడా ఉన్నారు. సునీల్ శెట్టి మాఫియాను తానే బెదిరించినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. శెట్టి అనే ఇంటిపేరు చెప్పి డబ్బు డిమాండ్ చేసే మాఫియాకు వ్యతిరేకంగా తాము ఒక బృందంగా ఏర్పడి ఎదుర్కొన్నామని వెల్లడించారు. ఒకసారి గ్యాంగ్‌స్టర్ హేమంత్ పుజారి, సునీల్ తండ్రిని తెల్లవారుజామున తుపాకీతో కాల్చి చంపుతామని బెదిరించాడు. అయినా, భయపడకుండా ఎదుర్కొన్నట్లు సునీల్ తెలిపారు. ప్రస్తుతం సునీల్ ‘కేసరి వీర్’ సినిమాలో నటిస్తున్నాడు.