సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ #SK30 అనౌన్స్ మెంట్

image 3

‘ఊరు పేరు భైరవకోన’ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న హీరో సందీప్ కిషన్‌కి కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. ఈరోజు తన ల్యాండ్‌మార్క్ 30వ సినిమాని అనౌన్స్ చేశారు. ‘ధమాకా’ వంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన #SK30కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్‌ల తర్వాత, వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి ప్రొడక్షన్ హౌస్‌లు ఈ సినిమా కోసం మళ్లీ జతకట్టాయి.

త్రినాధ రావు నక్కిన, ప్రసన్న కుమార్ బెజవాడ కాంబినేషన్ విజయవంతమైనది, వారు కలిసి ధమాకాతో సహా అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ కొత్త చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ
 కథ, స్క్రీన్‌ప్లే  డైలాగ్‌లను అందిస్తునారు. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

విభిన్నమైన స్క్రిప్ట్‌లతో అలరించే సందీప్ కిషన్ #SK30 లో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు, ఇది గ్రాండ్ ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందించబడుతుంది. ఈ సినిమాలో త్రినాథరావు నక్కిన, ప్రసన్నల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది.

తారాగణం: సందీప్ కిషన్

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
బ్యానర్లు: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
నిర్మాత: రాజేష్ దండా
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హ్యాష్‌ట్యాగ్ మీడియా