నారా రోహిత్ ‘సుందరకాండ’ డిజిటల్, సాటిలైట్ రైట్స్‌లో భారీ వసూళ్లు

1000575507

నారా రోహిత్ నటిస్తున్న చిత్రం సుందరకాండ థియేటర్లలో విడుదలకు ముందే భారీ వ్యాపార విజయాన్ని సాధించింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ మరియు సాటిలైట్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌కు రూ. 9 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే, హిందీ డబ్బింగ్ మరియు ఆడియో రైట్స్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేయబడ్డాయి. దీంతో ఈ చిత్రం యొక్క నాన్-థియేట్రికల్ విలువ మొత్తం రూ. 12 కోట్లకు చేరింది.సుందరకాండ ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

నారా రోహిత్ కు 20వ చిత్రం కాగా, ఈ సినిమా ద్వారా వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్‌ మహంకాళి దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్ తో పాటు వృతి వాఘాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా. సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగిల్ బహుసా బహుసా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే టీజర్ కి ట్రెమాండస్ రెస్పాన్స్ వచ్చింది. మొత్తం ప్రమోషనల్ కంటెంట్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.