స్టంట్‌మ్యాన్ మృతి – పా. రంజిత్‌ పై కేసు?

Screenshot 2025 07 15 161700

‘వెట్టువం’ సినిమా షూటింగ్‌లో దారుణ ఘటన జరిగింది. స్టంట్ ట్రైనర్ మృతి చెందారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం కారణమని ఆరోపణలు వస్తున్నాయి. దర్శకుడు పా. రంజిత్‌తోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళ దర్శకుడు పా. రంజిత్ రూపొందిస్తున్న ‘వెట్టువం’ చిత్ర షూటింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. నాగపట్నం జిల్లాలోని విలుంతమవాడి గ్రామంలో జరిగిన షూటింగ్‌లో స్టంట్‌మ్యాన్ మోహన్‌రాజ్ (52) గుండెపోటుతో కన్నుమూశారు. కాంచీపురం నివాసియైన మోహన్‌రాజ్, కారు ఛేజింగ్ సన్నివేశంలో స్టంట్ చేస్తూ కారు బోల్తా పడడంతో స్పృహ కోల్పోయారు. వెంటనే సిబ్బంది అతన్ని నాగపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. భద్రతా లోపాలే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి. కీజాయూర్ పోలీసులు దర్శకుడు పా. రంజిత్, రాజ్‌కమల్, వినోద్, ప్రభాకరన్‌లపై నిర్లక్ష్యం, కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ చిత్రంలో ఆర్య, దినేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.