
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ‘SSMB29’ హైప్ ఆకాశాన్ని తాకుతోంది. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ కొత్త మేకోవర్‌తో అదరగొట్టనున్నారు. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా, తమిళ స్టార్ చియాన్ విక్రమ్ కీలక పాత్రలో చేరినట్లు సమాచారం. ‘అపరిచితుడు’తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విక్రమ్, ఈ పాన్-వరల్డ్ మూవీతో మరోసారి సందడి చేయనున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. విక్రమ్ ఎంట్రీతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. రాజమౌళి ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. విక్రమ్ పాత్ర, సినిమా రిలీజ్ వివరాలు తెలియాల్సి ఉంది.