‘పుష్ప 2’ సాంగ్‌లో శ్రష్టి వర్మ మ్యాజిక్… సుకుమార్ ఫుల్ ప్రశంసలు

Screenshot 2025 05 29 182825

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప 2’లోని ‘సూసేకి’ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట ట్రెండింగ్‌లో దూసుకెళ్తూ అభిమానులను అలరిస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జోడీ డాన్స్ స్టెప్పులు యువతను ఆకట్టుకున్నాయి. ఈ పాటకు రీల్స్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ సాంగ్‌లోని 80 శాతం డాన్స్ మూమెంట్స్‌ను లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ రూపొందించారని సుకుమార్ వెల్లడించారు. ‘సీతా పయనం’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన, శ్రష్టి పనితనాన్ని మెచ్చుకున్నారు. “సూసేకి పాటలోని మూమెంట్స్‌లో శ్రష్టి సృజనాత్మకత ఉంది. ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వాలి,” అని సుకుమార్ అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రష్టి వర్మను సుకుమార్ మనస్ఫూర్తిగా సన్మానించారు.