శ్రీలీల ఇన్‌స్టా స్టోరీతో సంచలనం.. పెళ్లి రూమర్స్‌లో నిజమెంత?

Screenshot 2025 05 31 171539

టాలీవుడ్ యువ నటి శ్రీలీల ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ స్టోరీల్లో ఆమె చెంపలకు పసుపు రాస్తూ, పెద్దలు ఆశీర్వాదం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ‘కమింగ్ సూన్’ అనే క్యాప్షన్‌తో ఈ పోస్ట్‌లు నెటిజన్లలో కొత్త ఊహాగానాలకు తెరలేపాయి. శ్రీలీల రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా? లేక ఇది సినిమా ప్రమోషన్ కోసం చేసిన స్టంటా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ ఫోటోల వెనుక అసలు కథ వేరుగా ఉందని సమాచారం. జూన్ 14న శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా, సాంప్రదాయ తిథుల ప్రకారం ఆమె ఈ వేడుకను ముందుగానే జరుపుకున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయాన్ని గౌరవించే శ్రీలీల ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు సన్నిహితులు చెబుతున్నారు.
కానీ, ఈ చిత్రాలు చూసిన కొందరు ఆమె నిశ్చితార్థం జరిగినట్లు ఊహాగానాలు చేస్తుండగా, మరికొందరు ఇది కమర్షియల్ యాడ్ కోసం చేసిన గిమ్మిక్‌గా అనుమానిస్తున్నారు. ఈ ఉత్కంఠ రేకెత్తించే పోస్ట్‌లపై కొందరు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల రిలేషన్‌షిప్ గురించి గత కొంతకాలంగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరూ ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో దగ్గరైనట్లు టాక్. కార్తీక్ కుటుంబ కార్యక్రమాల్లో శ్రీలీల కనిపించడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఈ విషయంపై శ్రీలీల నుంచి త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆమె ఈ రూమర్స్‌కు చెక్ పెడుతుందా లేక కొత్త ట్విస్ట్ ఇస్తుందా అనేది సినీ అభిమానులకు ఆసక్తికరంగా మారింది.