
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు మరోసారి బాక్సాఫీస్ వద్ద గట్టిగా గుమ్మరించాడు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్‌లుగా, కార్తిక్ రాజు డైరెక్షన్‌లో వచ్చిన ‘సింగిల్’ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ మూవీ వీకెండ్‌లో భారీ కలెక్షన్స్‌తో సందడి చేసింది. బుక్ మై షోలో రెండు రోజుల్లో 1.5 లక్షల టికెట్స్ సేల్ అవడం సినిమా క్రేజ్‌ను చాటుతోంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ సినిమాకు బిగ్ బూస్ట్ ఇచ్చింది. గీతా ఆర్ట్స్ సమర్పణలో వచ్చిన ఈ ఎంటర్‌టైనర్, శ్రీవిష్ణు బ్రాండ్‌కు తగ్గట్టుగా ఫుల్ జోష్ చూపిస్తోంది. ఈ ‘సింగిల్’ హిట్ జోరు ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.