అలియా భట్ మనసు గెలిచిన సౌత్ స్టార్ ఫహాద్ ఫాజిల్

Screenshot 2025 05 29 113133

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలో బాలీవుడ్ స్టార్ అలియా భట్ ముఖ్య అతిథిగా హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా దక్షిణ భారత నటుడు ఫహాద్ ఫాజిల్‌ను ఆమె కొనియాడారు. “ఫహాద్ నా ఫేవరెట్ నటుల్లో ఒకరు. ఆయన నటన అద్భుతం. ‘ఆవేశం’ సినిమా నాకు ఎంతో ఇష్టం. అవకాశం వస్తే ఆయనతో కలిసి నటించడానికి సిద్ధం” అని అలియా అన్నారు. భాషలకు అతీతంగా సినిమాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారని, కరోనా సమయంలో సినిమా పరిశ్రమ ఒకే కుటుంబమని తెలిసిందని ఆమె చెప్పారు. అలియా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫహాద్ ఫాజిల్ నటనా ప్రతిభకు అలియా ఫిదా కావడం అభిమానులను ఆనందపరిచింది.