
పవన్ ప్రభ దర్శకుడిగా రూపేష్ నిర్మాతగా నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్, నేషనల్ అవార్డ్ గ్రహీత అర్చన, రూపేష్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘షష్టిపూర్తి’ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా నేడు రిలీజ్ అయింది. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి అంచనాలు సృష్టించింది. ఈ రివ్యూలో సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
శ్రీరామ్ (రూపేష్), నిజాయితీగల పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయం కోసం అవినీతి లేకుండా కేసులు వాదిస్తాడు. అనుకోకుండా జానకి (ఆకాంక్ష సింగ్)ని కలిసి ప్రేమలో పడతాడు. ఆమె కోసం తన పద్ధతులు మార్చుకుంటాడు. కానీ, జానకి ప్రేమ వెనక అసలు ఉద్దేశం ఏమిటి? శ్రీరామ్ తల్లిదండ్రులు విడిపోవాలనుకోవడం ఎందుకు? వారి షష్టిపూర్తి వేడుక జరుగుతుందా? అనేది కథ.
ప్లస్ పాయింట్స్:
ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరణ ఇస్తారు. ‘షష్టిపూర్తి’ కూడా తల్లిదండ్రులను కలిపే కొడుకు ప్రయత్నాన్ని చక్కగా చూపిస్తూ కొంతమేర ఆకట్టుకుంది. రూపేష్ తొలి సినిమా అయినా ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. కొన్ని డైలాగ్స్ చప్పట్లు కొట్టించాయి. ఇళయరాజా సంగీతం బీజీఎంలో మెప్పించింది.
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన లోపం. స్లోగా సాగే సన్నివేశాలు, బోరింగ్ సీన్స్ ప్రేక్షకులను విసిగించాయి. రన్‌టైమ్ ఎక్కువగా అనిపిస్తుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. రాజేంద్ర ప్రసాద్, అర్చనలాంటి సీనియర్ నటుల పాత్రలు సెకండాఫ్‌కు పరిమితమవడం నిరాశపరిచింది. లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ మరింత ఎమోషనల్‌గా ఉండాల్సింది.

సాంకేతిక విభాగం:
దర్శకుడు పవన్ ప్రభ ఫ్యామిలీ పాయింట్ బాగున్నా, ఎగ్జిక్యూషన్‌లో తడబడ్డాడు. లవ్ ట్రాక్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఎమోషన్ సైడ్ ట్రాక్ అయింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు పర్వాలేదు, కానీ ఎడిటింగ్ బెటర్‌గా ఉండాల్సింది.
ఫైనల్ గా ‘షష్టిపూర్తి’ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా కొంతవరకు ఆకట్టుకుంటుంది. అయితే, స్లో స్క్రీన్ ప్లే, బోరింగ్ సీన్స్, సాధారణ పాటలు నిరాశపరిచాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చవచ్చు.
రేటింగ్: 2.5/5