
మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీగా రికార్డ్ బ్రేక్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా రికార్డు బ్రేక్.
కథ విషయానికొస్తే : కోటీశ్వరులకు జన్మించి ఇద్దరు చిన్నారులు అనుకోని పరిస్థితుల వాళ్ళ అనాధలుగా మారతారు. అలా ఇద్దరు అనాధలు ప్రపంచవ్యాప్తంగా రెజ్లింగ్ ఛాంపియన్స్ గా ఎలా నిలిచారు? అలాంటి అనాధలకు స్నేహితురాలు అయిన ఒక అమ్మాయి వాళ్లకు తల్లిగా ఎలా మారింది? వాళ్లు రెజ్లింగ్ వెళ్లడానికి ఆ తల్లి చేసిన త్యాగం ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే. రైతుల గురించి తల్లి సెంటిమెంట్ గురించి చాలా బాగా చిత్రీకరించారు. సినిమాలో వి ఎఫ్ ఎక్స్ ఆకట్టుకుంటుంది.
ఎవరు ఎలా చేశారంటే :
కొత్త వాళ్ళైనా కూడా నిహారికపూర్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, సోనియా చాలా బాగా నటించారు. సత్య కృష్ణ గారి క్యారెక్టర్ సినిమాకి హైలైట్. విలన్ గా టి. ప్రసన్నకుమార్ గారు చాలా బాగా నటించారు. ఇందులో హీరోలు హీరోయిన్లు ఉండరు క్యారెక్టర్జేషన్స్ మాత్రమే ఉంటాయి.
టెక్నికల్ ఆస్పెక్ట్ :
ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని నిర్మాణం. చదలవాడ శ్రీనివాసరావు గారు ఎంచుకున్న కథ డైరెక్షన్ బాగున్నాయి. అంగిరెడ్డి శ్రీనివాస్ అందించిన కథ సాబు వర్గీస్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. డిఓపిగా కంతేటి శంకర్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
నిహారిక పూర్, నాగార్జున, సత్య కృష్ణ, రగ్ధా ఇఫ్తాకర్, టి. ప్రసన్నకుమార్ గారి నటన
చదలవాడ శ్రీనివాసరావు గారి దర్శకత్వం
వి ఎఫ్ ఎక్స్
అంగి రెడ్డి శ్రీనివాస్ కథ
సాబు వర్గీస్ సంగీతం
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్
సెకండ్ హాఫ్ నిడివి ఎక్కువ ఉండటం
ప్రతి భారతీయుడు చూసి గర్వించే చిత్రం
రేటింగ్ : 3/5