మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘ఈగల్’ ట్రైలర్ డిసెంబర్ 20న విడుదల

image 1

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం 2024లో విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో ఒకటి. టీజర్ విడుదలైన తర్వాత క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. ఇటివలే విడుదల చేసిన ఈగల్ ఊర మాస్ అంథమ్ ఆడు మచ్చా పాట చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

ఇప్పుడు మేకర్స్ ఈగల్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న ఈగల్ ట్రైలర్ డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్ లో రవితేజ పెద్ద మిషన్ గన్ తో ఫైర్ చేసున్న టెర్రిఫిక్ లుక్ లో కట్టిపడేశారు.

ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం.

కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ & దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మణిబాబు కరణం డైలాగ్స్ అందించారు. దావ్‌జాంద్ సంగీత సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.

ఈగల్ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: రవితేజ, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా, ధ్రువ, ఎడ్వర్డ్, మద్ది, జరా, అక్షర

సాంకేతిక విభాగం:
ఎడిటింగ్, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: టిజి విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
రచన: కార్తీక్ ఘట్టమనేని, మణిబాబు కరణం
మాటలు: మణిబాబు కరణం
సంగీతం: డేవ్ జాంద్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, కమిల్ ప్లాకి, కర్మ్ చావ్లా
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
సాహిత్యం: చైతన్య ప్రసాద్, కేకే, కళ్యాణ్ చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
యాక్షన్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్, టోమెక్
పీఆర్వో : వంశీ-శేఖర్
VFX సూపర్‌వైజర్: ముత్తు సుబ్బయ్య