‘RAPO22’ సంచలనం – రామ్‌తో ఉపేంద్ర ఎంట్రీ.. టైటిల్ గ్లింప్స్‌కు రెడీ

rapo22 movie

రామ్ పోతినేని నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘RAPO22’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పి.మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ ‘సాగర్’ పాత్రలో కొత్త మేకోవర్‌తో అలరించనున్నాడు. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. కన్నడ స్టార్ ఉపేంద్ర ‘సూర్య కుమార్’ పాత్రలో ఎంట్రీ ఇస్తూ ఫస్ట్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. రామ్ బర్త్‌డే సందర్భంగా మే 15న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, ఉపేంద్ర కీలక పాత్రతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టైటిల్ రివీల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు