రాశి ఖన్నా షూటింగ్‌లో గాయం – అభిమానుల్లో ఆందోళన, స్పీడీ రికవరీ కోసం ప్రార్థనలు

నటి రాశి ఖన్నా ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ సమయంలో జరిగిన ఈ ఘటనలో ఆమె ముఖం, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయాల ఫోటోలను షేర్ చేసిన రాశి, “కొన్ని పాత్రలకు శరీరం, శ్వాస, గాయాలు అన్నీ ఇవ్వాలి. తుఫానులా తయారైన తర్వాత ఉరుము భయపెట్టదు. త్వరలో రాబోతుంది” అని పోస్ట్ చేశారు. అయితే, ఈ సినిమా ఏదనే వివరాలు ఆమె వెల్లడించలేదు. ఈ ఘటనతో అభిమానులు ఆందోళన చెందుతూ, రాశి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. రాశి ఖన్నా ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపిస్తారనే ఆసక్తి నెలకొంది.