GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “R” చిత్ర ప్రారంభం

GMAA ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్లో శిరీష గారి సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “R”. గోలి రామకృష్ణ దర్శక నిర్మానంలో వస్తున్న ఈ చిత్రానికి గాలి బాల కిరణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ చిత్రం నేడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పూజ కార్యక్రమాలతో ఘనంగా మొదలు కావడం జరిగింది. సంతోష్ కృష్ణన్, భాగ్య రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, దుర్గమ నాయుడు, పవన్, సిరి, సంధ్య, భాను చందర్, స్వాతి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి సినిమాలోగ్రాఫర్ గా అశోక రెడ్డి కంకల్ల, ఎడిటర్ గా మునీష్, కొరియోగ్రాఫర్ గా శివాజీ, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా కడవకల్లు గణేష్, అసిస్టెంట్ డైరెక్టర్గా వేదాంత్ రాజ్ అందే వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈనెల 20వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ సంవత్సరంలోనే అక్టోబర్ 17వ తేదీన “R” చిత్రం విడుదల కానుందని మేకర్స్ తెలిపారు.

గోలి రామకృష్ణ మాట్లాడుతూ… “ఈ చిత్రాన్ని రెండు షెడ్యూల్స్ లోనే మాకు ఉన్న స్క్రిప్ట్ తో, నటీనటుల సహకారంతో చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పూర్తి చేస్తాము. మంచి సందేశాత్మకమైన చిత్రంగా మీ ముందుకు అక్టోబర్ 17వ తేదీన R చిత్రం రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాలు త్వరలోనే ఒక విభిన్నమైన శైలిలో తెలియజేస్తాము” అన్నారు.

సహ నిర్మాత గాలి బాల కిరణ్ రెడ్డి మాట్లాడుతూ… “మా దర్శకునికి సినిమా పై ఉన్న మక్కువకు చిత్ర విడుదల తేది కూడా ఇప్పుడే వెల్లడించడం జరిగింది” అన్నారు.

నటీనటులు : సంతోష్ కృష్ణన్, భాగ్య రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, దుర్గమ నాయుడు, పవన్, సిరి, సంధ్య, భాను చందర్, స్వాతి తదితరులు

సాంకేతిక బృందం :
బ్యానర్ : GMAA ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ : శిరీష
దర్శక నిర్మాత : గోలి రామకృష్ణ
సహ నిర్మాత : గాలి బాల కిరణ్ రెడ్డి
డిఓపి: అశోక రెడ్డి కంకల్ల
ఎడిటర్ : మునీష్
కొరియోగ్రఫీ : శివాజీ
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ : కడవకల్లు గణేష్ అసిస్టెంట్ డైరెక్టర్ : వేదాంత్ రాజ్ అందే
పిఆర్వో : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం