
విశాల్ ‘మకుటం’ నుంచి వినాయక చవితి సందర్భంగా అద్భుత పోస్టర్ విడుదల
విశాల్ హీరోగా రూపొందుతోన్న ‘మకుటం’ చిత్రం నుంచి వినాయక చవితి సందర్భంగా ఆకర్షణీయమైన పోస్టర్ విడుదలైంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్‌బి చౌదరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రవి అరసు దర్శకుడు. సముద్రం నేపథ్యంలో మాఫియా కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీలో విశాల్ మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారు. అంజలి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రఫీ, ఎన్‌బి శ్రీకాంత్ ఎడిటింగ్‌తో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
