‘ఉస్తాద్’ నుండి పవన్ కళ్యాణ్ పొలిటికల్ పంచ్

WhatsApp Image 2024 03 19 at 13.37.51 0f7a93b3

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్సింగ్’ నుండు ఈరోజు సాయంత్రం 4.45 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. ‘ఆశ్చర్య పోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ ఫొటో బయటికొచ్చిన నేపథ్యంలో.. మూవీ టీజర్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలలో బిజీ గ ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా నుండి ఇటువంటి ఓ అప్డేట్ ప్రజలలో మరో కొత్త ఆలోచన వచ్చేలా చేస్తుంది. సాయంత్రం రానున్న అప్డేట్ లో ఓ డైలాగ్ ఉండబోతుంది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే అది రాజకీయంగా పంచ్ కావొచ్చేమో అని ఓ అంచనా.