నితిన్ ‘రాబిన్ హుడ్’ ఓటీటీలో రికార్డుల సునామీ

Screenshot 2025 05 17 092002

నితిన్ నటించిన ‘రాబిన్ హుడ్’ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రికార్డ్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతోందని జీ5 ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు జీవి ప్రకాశ్ సంగీతం అదనపు బలం. ధనవంతుల డబ్బును దోచి పేదలకు పంచే కథాంశం, డ్రగ్స్ మాఫియాతో ముడిపడిన ట్విస్ట్‌లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. జీ5లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా, సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. నితిన్ డైనమిక్ పెర్ఫార్మెన్స్, హై-ఎనర్జీ యాక్షన్ సీన్స్‌తో ‘రాబిన్ హుడ్’ ఓటీటీ రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది.