ప్రభాస్ ఫుడ్ సీక్ర ట్స్‌పై నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

prabhas romantic track in swing in the raja saab b 1604240900

స్టార్ హీరో ప్రభాస్‌తో కలిసి ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్, ఆయన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రభాస్ ఫుడ్ ప్రియత్వం, సెట్‌లో ఆతిథ్యం గురించి నిధి ఏమన్నారో తెలుసుకుందాం.

‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న నిధి అగర్వాల్, ప్రభాస్‌తో పనిచేసిన అనుభవాన్ని షేర్ చేశారు. ప్రభాస్ ఆహారం గురించి మాట్లాడుతూ… “సెట్‌లో అందరూ ఫుడ్ గురించే మాట్లాడతారు, కానీ ప్రభాస్ ఇంట్లో వండిన ఆహారం అద్భుతం. నేను వెజిటేరియన్‌ని, పనీర్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఏది అడిగినా ఎక్కువగానే పంపిస్తారు,” అని నవ్వుతూ చెప్పారు. ప్రభాస్ స్వీట్ నేచర్, ఆత్మీయ ఆతిథ్యం గురించి నిధి ప్రశంసలు కురిపించారు. ఇక పోతే ఈ హారర్-రొమాంటిక్ కామెడీ చిత్రంలో నిధి పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని హింట్ ఇచ్చారు.