రవితేజ పాటకు స్టేజ్ పై డాన్స్ తో దుమ్మురేపిన నవీన్ చంద్ర

Screenshot 2025 10 29 140608

టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర అంటే పరిచయం అవసరం లేని పేరు. అందాల రాక్షసి సినిమాతో 2012లో వెండి తెరపై తొలిసారి కనిపించిన నవీన్ చంద్ర ఆ తర్వాత హీరోగానే కాక వివిధ పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులను తన ప్రతిపాత్రతో ముగ్ధులను చేస్తూ వచ్చారు. ఇది ఇలా ఉండగా అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నెగెటివ్ పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్పోయేల చేశారు. ఆ తరవాత తనదైన శైలిలో కొన్ని సినిమాలు చేస్తుండగా మరోసారి ఒక్కసారిగా నెగెటివ్ పాత్రలో మరొకసారి సర్ప్రైజ్ చేస్తూ వస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రానున్న మాస్ జాతర చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజకు ఆపోజిట్ గా కనిపించనున్నారు. ట్రైలర్ లో నవీన్ చంద్ర లుక్, డైలాగులు చూస్తే మరోసారి ప్రేక్షకుల గుండెల్లో శివుడు క్యారెక్టర్ నిలిచిపోయేలా అనిపిస్తుంది.

అలాగే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ పై రవితేజ ముందు రవితేజ పాటకు డాన్స్ చేస్తూ దుమ్మురేపారు. రవితేజ పాటకు రవితేజలా డాన్స్ చేయడంతో రవితేజ సైతం ఆశ్చర్యపోయారు. అంతే కాక రవితేజ సినిమాలోని ఒక డైలాగ్ చెప్తూ తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ రవితేజ గారు, సూర్య గారు అంటే ఆయనకు ఎంతో అభిమానం అని తెలిపారు. వారి ఇద్దరి ముందు నుంచుని ఇలా మాట్లాడటం తనకు డబుల్ ధమాకా అన్నారు. ఒక మనిషిలా ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనేది రవితేజ గారిని చూసి నేర్చుకున్నాను అన్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గతంలో చేసిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నెగెటివ్ రోల్ వల్ల ఎంతో మంచి పేరు వచ్చింది. మాస్ జాతర చిత్రంతో మరోసారి మంచి పేరు వస్తుంది అని కోరుతున్నాను అని అన్నారు.

మాస్ మహారాజ్ రవితేజ శివుడు పాత్రలో నవీన్ చంద్ర అద్భుతంగా నటించారు అని నవీన్ చంద్ర పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుంది అని చెప్పారు. అలాగే నవీన్ చంద్ర డాన్స్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పారు.