నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సరిపోదా శనివారం’లో నానిని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

గత నెలలో ఈ సినిమా ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా ,ఈ రోజు యూనిట్ కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఇది లెన్తీ షెడ్యూల్ లో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌లతో పాటు ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్ ని చిత్రీకరించనున్నారు.

అన్‌చెయిన్డ్ వీడియోలో చూపించినట్లుగా, నాని సినిమాలో కఠినమైన లుక్‌లో కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.

పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్ జే సూర్య

సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్