తొలి ఇండిపెండెంట్ చిత్రం ‘బంధం రేగడ్’ తో విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు సాహిత్ మోత్ఖురి రెండో చిత్రం ‘సవారీ’ తో బాక్సాఫీస్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు తన మూడవ చిత్రం ‘పొట్టేల్ తో రాబోతున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రంలో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన్ ఫస్ట్ ఇంపాక్ట్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ నగిరో పాటని విడుదల చేశారు. శేఖర్ చంద్ర ఈ పాటని బ్యూటీఫుల్ హార్ట్ టచ్చింగ్ మెలోడిగా కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి, లాలస.ఆర్ తమ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు. కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ మనసుని హత్తుకున్నాయి. పాటలో విజువల్స్ చాలా ప్లజంట్ గా వున్నాయి. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది.
తారాగణం: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సేన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు.
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం – సాహిత్ మోత్ఖురి
నిర్మాతలు – నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె
సంగీతం – శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్ – మోనిష్ భూపతి రాజు
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్
లిరిక్స్ – కాసర్ల శ్యామ్
పీఆర్వో: వంశీ శేఖర్