
నాగచైతన్య తండేల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి, ఇప్పుడు మరో బ్లాక్‌బస్టర్‌కు రెడీ అవుతున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో NC24 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మిథికల్ థ్రిల్లర్‌లో చైతూ సాహసిక పాత్రలో కనిపించనున్నాడు. ఈ రోల్ కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని అభిమానులను ఆశ్చర్యపరచనున్నాడు. ఫిట్‌నెస్‌పై ఎప్పటికీ శ్రద్ధ చూపే చైతూ, ఈ సినిమా కోసం కఠిన ట్రైనింగ్, స్ట్రిక్ట్ డైట్‌ను అనుసరిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఇటీవల షూటింగ్ స్టార్ట్ అయిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. చైతూ కెరీర్‌లో 24వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం మరో సక్సెస్ స్టోరీగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వ ప్రతిభ, చైతూ నటన ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.