500 కోట్లతో మోహన్‌లాల్ బాక్సాఫీస్ ఊచకోత

Screenshot 2025 05 12 185342

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు! ఈ ఏడాది ‘ఎంపురాన్’, ‘తుడరుం’ సినిమాలతో రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న మోహన్‌లాల్ సత్తా చాటారు. ‘ఎంపురాన్’ 300 కోట్లు, ‘తుడరుం’ 200 కోట్ల గ్రాస్‌తో సంచలనం సృష్టించాయి. ‘బరోజ్’ డిజాస్టర్ తర్వాత ఈ వరుస విజయాలతో మోహన్‌లాల్ సెన్సేషనల్ కంబ్యాక్ చేశారు.
తరుణ్ మూర్తి డైరెక్షన్‌లో, జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌తో ‘తుడరుం’ మరో హైలైట్‌గా నిలిచింది. మలయాళ సినిమా ఇండస్ట్రీకి భారీ రెవెన్యూ తెచ్చిన ఈ చిత్రాలు మోహన్‌లాల్ స్టార్‌డమ్‌ను ఆకాశానికి తాకేలా చేశాయి. మరి, మోహన్‌లాల్ తదుపరి ప్రాజెక్ట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.