‘మిరాయ్’ షూటింగ్ స్పీడప్ – తేజ సజ్జాతో భారీ యాక్షన్ అడ్వెంచర్

WhatsApp Image 2025 05 20 at 11.59.27 c77e0c78

‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ సినిమా షూటింగ్ ముంబైలోని చారిత్రాత్మక గుహల్లో ప్రారంభమైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ యాక్షన్-అడ్వెంచర్‌లో తేజ సూపర్ యోధుడిగా కనిపించనున్నాడు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా 8 భాషల్లో 2D, 3D ఫార్మాట్లలో ఆగస్టులో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. షూటింగ్ షెడ్యూల్ స్పీడ్‌గా సాగుతోంది. కొత్త షెడ్యూల్‌లో తేజతో పాటు పలు కీలక పాత్రలు పాల్గొంటున్నాయి. ఈ చిత్రం తేజ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు.