“మాస్ జాతర” రిలీజ్ డేట్ ఫిక్స్ – రవితేజ, శ్రీలీల సందడి రెడీ

మాస్ మహారాజ్ రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా రూపొందుతున్న ‘మాస్ జాతర’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొత్త దర్శకుడు భాను భోగవరపు రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మొదట మేలో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా రవితేజ లుక్‌తో ఓ డైనమిక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి, అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించనున్నాడని, శ్రీలీలతో ఆయన కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని టాక్. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాయి. గణేష్ చతుర్థి సీజన్‌లో ఈ సినిమా మాస్ అప్పీల్‌తో ప్రేక్షకులను అలరించనుంది.