
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌తో కొత్త చిత్రం కోసం జతకడనున్నారు. ‘మహారాజ’ సినిమాతో అలరించిన నిథిలన్, రజనీకి కథ వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన దర్శకుడు నిథిలన్ స్వామినాథన్, ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ రివెంజ్ డ్రామా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, విజయ్ సేతుపతి నటనకు ప్రశంసలు అందుకుంది. తాజాగా, నిథిలన్ రజనీకాంత్‌ను కలిసి కొత్త కథను వివరించినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ కథ రజనీకి నచ్చడంతో ప్రాజెక్ట్‌కు ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. నిథిలన్ యూనిక్ స్టోరీ టెల్లింగ్, రజనీ స్టార్‌డమ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించే అవకాశం ఉందని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ కాంబినేషన్ ఎలాంటి సినిమాటిక్ అద్భుతాన్ని అందిస్తుందో చూడాలి.