రెండు తెలుగు రాష్ట్రాల్లో తన రెండవ అమ్జద్ హబీబ్ ప్రీమియం సలోన్ ప్రారంభం

ప్రసిద్ధ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ మరియు అమ్జద్ హబీబ్ సలోన్స్ వ్యవస్థాపకుడైన అమ్జద్ హబీబ్, గురునానక్ కాలనీలో అమ్జద్ హబీబ్ ప్రీమియం సెలూన్ ని నూతనంగా ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గ రామ్మోహన్, జబర్దస్త్ ఫ్రేమ్ వర్ష ముఖ్య అతిథులుగా విచ్చేసి సెలూన్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ మాట్లాడుతూ సెలూన్ రంగంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన హబీబ్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమ్జద్ హబీబ్ సెలూన్ ని ప్రారంభించడం సంతోషకరమన్నారు.జైళ్ళలో ఉండే ఖైదీలకు సెలూన్ రంగంలో శిక్షణ ఇచ్చి వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దడంశుభ పరిణామం అని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తో పాటు పలువురు బాలీవుడ్ తారలకు హెయిర్ స్టైలింగ్ చేయడం అభినందనీయమని అన్నారు. దేశంలోనే అమరావతిని ఒక ఉన్నత నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి సుందరనగరంగా మారుతుందని ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తారని వివరించారు. అమరావతిలో మరో 30 సెలూన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దే నిర్వాహకులను కోరారు.

జబర్దస్త్ ఫేమ్ వర్ష మాట్లాడుతూ విభిన్న రకాల హెయిర్ స్టైల్ కోరుకునేవారు విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో హైదరాబాదుకు తరలి వచ్చే వారని అన్నారు. విజయవాడ నగర వాసుల కోసం అమ్జద్ హెయిర్ సెలూన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. ప్రస్తుతం మహిళలతో పాటు పురుషులు కూడా హెయిర్ స్టైల్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని లేటెస్ట్ హెయిర్ కట్స్ చేయడంలో అమ్జద్ హబీబ్ సెలూన్ పేరుగాంచిందని ఆమె పేర్కొన్నారు.

అమ్జద్ హబీబ్ మాట్లాడుతూ 100 సంవత్సరాల నుంచి హెయిర్ సెలూన్ రంగంలో తమ కుటుంబం ఉందని దేశంలోనే ప్రముఖులందరికీ తమ కుటుంబ సభ్యులు హెయిర్ కట్ చేశారని తెలిపారు. అమరావతిలో మొదటి సెలూన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని రానున్న కాలంలో తెలుగు రాష్ట్రాల్లో 100 సెలూన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విభిన్న రకాల హెయిర్ స్టైల్ కోరుకునే వారికి తమ వద్ద నిష్ణాతులైన సిబ్బంది ఉన్నారని వారికి నచ్చిన రీతిలో హెయిర్ కట్ హెయిర్ కలరింగ్ హెయిర్ ట్రీట్మెంట్ పలు రకాల సేవలు అందిస్తామని తెలియజేశారు. విజయవాడ నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌కు మాస్టర్ ఫ్రాంచైజర్ మహేష్ బిజినెస్ హెడ్ ఆపరేషన్స్ నిర్వహకులు మాట్లాడుతూ అమ్జద్ హబీబ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ మా సలోన్స్ ప్రీమియం క్వాలిటీ ఉత్పత్తులు ఉపయోగించి హెయిర్ కేర్ సేవలను అందిస్తాయి, కొత్త అందాల ట్రెండ్స్‌లో ముందంజలో ఉంటాయి. నైపుణ్యం కలిగిన హెయిర్ కేర్, గుణాత్మక ఉత్పత్తులు, తాజా అందాల ట్రెండ్స్, మానపవర్ హైరింగ్‌లో 100% మద్దతు, 20 సంవత్సరాల అనుభవం కలిగిన వారు ఉన్నారు అని అలాగే ఫ్రాంచైజ్ యాజమాన్యం కోసం ఆసక్తి కలిగి ఉన్నారా?

ఫ్రాంచైజ్ విచారణల కోసం, మమ్మల్ని సంప్రదించండి: 970 499 7786, 729 887 8888