‘డ్రాగన్’ హిట్‌తో కయదు లోహర్ జోరు – రెమ్యునరేషన్ రూ.2 కోట్లు

Screenshot 2025 05 17 182730

కన్నడ చిత్రం ‘ముకిల్ పేట్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన కయదు లోహర్, తొలి చిత్రంతో విజయం సాధించలేకపోయింది. మలయాళం, తెలుగు, మరాఠి చిత్రాలు కూడా ఆమెకు క్రేజ్ తెచ్చిపెట్టలేదు. అయినా అవకాశాలు ఆమెను వెంటాడాయి. తమిళంలో రీసెంట్‌గా విడుదలైన ‘డ్రాగన్’ సూపర్ హిట్ కావడంతో కయదు లక్ మారిపోయింది. ఈ చిత్రానికి రూ.30 లక్షలు తీసుకున్న ఆమె, సక్సెస్ తర్వాత రూ.70 లక్షలు అదనంగా అందుకుంది. ఇప్పుడు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. శింబు, ధనుష్‌లతో సినిమాలు చేస్తూ, అధర్వతో ‘ఇదయం మురళి’, జీవీ ప్రకాష్‌తో ‘ఇమ్మార్టల్’ చిత్రాల్లో నటిస్తోంది. ధనుష్‌తో మరో రెండు ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నాయి. ‘డ్రాగన్’ సక్సెస్‌తో కయదు సినీ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.