
నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్ ‘రామాయణం’ సినిమా సెట్స్‌పై సందడి చేస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కూడా చేరారు. ఆమె రావణుడి సతీమణి మండోదరి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రకుల్ ప్రీతి సింగ్ సూర్పనకగా ఖరారైన ఈ ప్రాజెక్ట్ రోజుకో వార్తతో వైరల్ అవుతోంది. కాజల్ ఈ పాత్ర కోసం చర్చలు జరుపుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్. రాకెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా బాలీవుడ్‌లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. కాజల్ ఎంట్రీతో హైప్ రెట్టింపు అయింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ ‘రామాయణం’ భారతీయ సినిమాలో కొత్త చరిత్ర సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
