‘SSMB29’లో జాన్ అబ్రహం ఎంట్రీ – రాజమౌళి భారీ యాక్షన్ అడ్వెంచర్?

Screenshot 2025 05 16 110154

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘SSMB29’ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ గ్లోబల్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం కూడా చేరినట్లు సమాచారం. ‘పఠాన్’లో విలన్‌గా గుర్తింపు పొందిన జాన్, ఈ చిత్రంలో ప్రియాంకతో కీలక సన్నివేశాల్లో కనిపించనున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ జరగనుంది. రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కాశీ నేపథ్యంలో భారీ సెట్స్‌తో రూపొందుతోంది. మహేష్ బాబు పాత్ర హనుమాన్‌ను ప్రతిబింబిస్తుందని తెలుస్తోంది. రాజమౌళి ఈ చిత్రంతో పాన్-ఇండియా స్థాయిలో మరో సంచలనం సృష్టించనున్నారు. జాన్ ఎంట్రీతో అభిమానుల అంచనాలు రెట్టింపయ్యాయి